- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
34 ఏళ్లైనా పెళ్లి చేసుకోని మెగా బ్యూటీ.. నా తల్లికి లేని బాధ మీకెందుకు అంటూ సంచలన కామెంట్స్..
‘పిల్లనువ్వు లేని జీవితం’(Pilla Nuvvu Leni Jeevitham) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ రెజీనా కసాండ్రా(Regina Cassandra) గురించి మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: ‘పిల్లనువ్వు లేని జీవితం’(Pilla Nuvvu Leni Jeevitham) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ రెజీనా కసాండ్రా(Regina Cassandra) గురించి మనందరికీ సుపరిచితమే. ఫస్ట్ మూవీనే మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పించింది. అప్పట్లో దాదాపు ప్రముఖ హీరోల సరసన నటించి మెప్పించింది. అలాగే తన అందం, అభినయంతో మెస్మరైజ్ చేసింది. ఇక తెలుగులో చివరిగా ‘శాకిని డాకిని’ మూవీతో మన ముందుకు వచ్చిన ఈ చిన్నది.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. కానీ బాలీవుడ్,కోలీవుడ్‌లో వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తూ మంచి స్టార్ డమ్ అందుకుంటుంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రెజీనా వయసు 34 సంవత్సరాలు. దీంతో నిత్యం ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. ఇప్పటికే తన పెళ్లి గురించి వస్తున్న కామెంట్స్ పై ముక్కు సూటిగానే ఆన్సర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి తన వివాహం గురించి వచ్చిన ప్రశ్నలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ.. "నా పెళ్లి గురించి నా తల్లే అడగడం లేదు.. మీరెందుకు అడుగుతున్నారు..? మీకెందుకు అంత అక్కర. నాతో ఎవరైనా సంబంధం పెట్టుకుంటే వారికే కష్టం, అందుకే ఫ్రెండ్ షిప్ మాత్రమే నాతో ఈజీగా ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.






