- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగ్నంగా బర్త్ డే సెలబ్రేషన్స్ ఏంటని మెగా బ్యూటీపై ట్రోల్స్.. స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిందిగా! (పోస్ట్)
బ్రిటిష్ నటి అమీ జాక్సన్(Amy Jackson) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

దిశ, సినిమా: బ్రిటిష్ నటి అమీ జాక్సన్(Amy Jackson) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ధనుష్ సరసన ‘నవ మన్మధుడు’(Nava Manmadhudu) సినిమాలో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఇక తెలుగులో మెగా హీరో రామ్ చరణ్‌తో ‘ఎవడు’(Yevadu)కీలక పాత్రలో చేసి ఊహించని రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకుంది. ఇక విక్రమ్ ‘ఐ’లో తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయడంతో పాటు అందరినీ మైమరిపించింది. గత ఏడాది రెండు చిత్రాల్లో నటించింది. ఇక అమీ జాక్సన్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి కాకుండానే ఓ బాబుకు జన్మనిచ్చింది.
ఆ తర్వాత ఇద్దరి మధ్యలో ఏవో మనస్పర్థలు రావడంతో అతనికి బ్రేకప్ చెప్పి విడిపోయింది. ఆ తర్వాత ఎడ్ వెస్టిక్ అనే వ్యక్తితో కొద్ది కాలం డేటింగ్ చేసి గత ఏడాది ఆగస్టులో పెళ్లి చేసుకుంది. ఇక కొడుకు భర్తతో సొంతం దేశంలో సెటిల్ అయిపోయింది. ఇటీవల ప్రెగ్నెంట్ అయినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇక నిత్యం నెట్టింట పోస్టులు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. బేబీబంప్‌తో ఉన్న ఆమె నగ్నంగా ఫొటో షూట్ చేయడంతో ఈ పిక్స్ దుమారం రేపాయి. సినిమాలకు దూరం అయినప్పటికీ అమీ జాక్సన్ సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టిన ఆమె పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, అమీ జాక్సన్ పుట్టిన రోజు కావడంతో ఆమె భర్త అర్థరాత్రి సర్‌ప్రైజ్ చేశాడు.
కేక్ తీసుకెళ్లడంతో ఆమె బెడ్‌పై కూర్చుని కొడుకుతో కలిసి కేక్ కటింగ్ చేసింది. అయితే అందులో ఈ అమ్మడు బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నట్లు బెడ్ షీట్ కప్పుకుని కనిపించింది. అలాగే తన కొడుకు ముందే భర్తకు లిప్‌లాక్ ఇచ్చింది. దీంతో అది చూసిన వారంతా చీ చీ ఇదేం పద్ధతి అని ఆమెను ట్రోల్ చేస్తున్నారు. పక్కన కొడుకు పెట్టుకుని నగ్నంగా ఉండటం ఏంటని దారుణంగా మాట్లాడుతున్నారు. ఇక ఈ పోస్టులు చూసిన అమీ జాక్సన్ స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చింది. ‘‘లోపల బట్టలు ఉన్నాయి. నేను ఎలా ఉండాలో నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు. ముందు నోరు మూసుకొని నా కామెంట్ బాక్స్ నుంచి అవతలికి వెళ్లిపో’’అని కౌంటర్ వేసింది. దీంతో రామ్ చరణ్ బ్యూటీ స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిందిగా అని అంటున్నారు. కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.






