అలాంటి సమస్యతో బాధపడుతున్న నటి.. గాయంతో దర్శనమివ్వడంతో ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్

by Mallepaka Hamsa |

సీనియర్ నటి ఖుష్బు(Kushboo) సుందర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది.

అలాంటి సమస్యతో బాధపడుతున్న నటి.. గాయంతో దర్శనమివ్వడంతో ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: సీనియర్ హీరోయిన్ ఖుష్బు(Kushboo) సుందర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. రజినికాంత్(Rajinikanth), పవన్ కల్యాణ్(Pawan Kalyan), చిరంజీవి(Chiranjeevi), నాగార్జున(Nagarjuna), కమల్ హాసన్ వంటి స్టార్స్‌తో కలిసి నటించి ఫుల్ ఫేమ్ దక్కించుకుంది. ఇక నటిగానే కాకుండా ఆమె నిర్మాతగానూ పలు చిత్రాలు తెరకెక్కించింది. ఆ తర్వాత సినిమాలకు దూరం అయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక 2023లో ఆమె గోపీచంద్ హీరోగా నటించిన ‘రామబాణం’ కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె ప్రస్తుతం ఓ మూవీ చేస్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు గాయం అయింది.

ఇక ఈ విషయాన్ని తెలుపుతూ ఖుష్బు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. ఎడమ చేతికి గాయం కావడంతో కట్టుకుని కనిపించింది. ఈ పోస్ట్‌కు ‘‘కొన్ని గాయాలు మన ప్రయాణాన్ని ఆపాలని చూస్తాయి. అయినప్పటికీ మనం వెనక్కీ తగ్గకుండా చిరునవ్వుతో ముందుకు సాగాలి’’ అనే క్యాప్షన్ జత చేసింది. కాగా, ఆమె చేతి ఎలర్జీకి గురైనట్లు తెలుస్తోంది. ఈ సమస్య రావడానికి కారణం తీవ్ర ఎక్సర్‌సైజుల వల్ల వస్తుందని సమాచారం. ఇక ఆమె కూడా చేయడం వల్ల ఇప్పుడు నొప్పితో బాధపడుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు ఆమెకు ఏమైందో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. అలాగే ఖుష్బూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Next Story