- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంప్రదాయ లుక్‌లో పుత్తడిబొమ్మలా మెరుస్తున్న మెగా బ్యూటీ.. స్మైలింగ్ క్వీన్ అంటూ నెటిజన్ల కామెంట్స్
యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఇచట వాహనాలు నిలుపరాదు’(Ichata Vahanalu Nilaparadhu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ టైంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. రీసెంట్‌గా మీనాక్షి టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కించిన ఈ మూవీలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) కూడా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. మరోపక్క మీనాక్షి నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోస్‌లతో పాటు వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ భామ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది.
అందులో గోల్డెన్ అండ్ కాఫీ కలర్ లంగా జాకెట్ వేసుకుని ట్రెడిషనల్ లుక్‌లో పుత్తడి బొమ్మలా రెడీ అయింది. అంతే కాకుండా తన స్మైల్‌తో అందరినీ ఫిదా చేస్తుంది. ఒంటినిండా నగలతో అచ్చం తెలుగింటి అమ్మాయిలా చాలా ముచ్చటగా కనిపిస్తుంది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు వావ్ సూపర్, స్మైలింగ్ క్వీన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరు ఈ ముద్దుగుమ్మ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.






