పర్పుల్ కలర్ శారీలో మెరిసిపోతున్న మెగా బ్యూటీ.. సన్నజాజి తీగలా ఉన్నావంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పర్పుల్ కలర్ శారీలో మెరిసిపోతున్న మెగా బ్యూటీ.. సన్నజాజి తీగలా ఉన్నావంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఇచట వాహనాలు నిలుపరాదు’(Ichata Vahanalu Nilaparadhu) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. అతి తక్కువ టైంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. రీసెంట్‌గా మీనాక్షి టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి(Anil Ravipudi) తెరకెక్కించిన ఈ మూవీలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) కూడా నటించారు. ప్రెజెంట్ నాగ చైతన్య సరసన ఎన్‌సి-24 మూవీతో పాటు నవీన్ పొలిశెట్టి సరసన మరో సినిమాలో నటిస్తోంది.

మరోపక్క మీనాక్షి నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోస్‌లతో పాటు వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ భామ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో పర్పుల్ కలర్ శారీ కట్టుకొని మెరిపోయింది. చాలా నాజుగ్గా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సన్నజాజి తీగలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story