- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టార్ నటుడితో పెళ్లికి సిద్ధమైన మెగా బ్యూటీ.. ఈ ప్రకటన చేయడం గర్వంగా ఉందంటూ ఆసక్తికర పోస్ట్
యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ‘హలో’ సినిమాతో వచ్చింది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ‘హలో’ సినిమాతో వచ్చింది. ఆ తర్వాత చిత్రలహరి(Chitralahari), రణరంగం, హీరో వంటి మూవీస్ చేసి తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను దక్కించుకుంది. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో ఈ అమ్మడు మలయాళ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడ వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ‘ఒడుం కుతిరా చదుం కుతిర’(Odum Kuthira Chadum Kuthira) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అల్తాఫ్ సలీం(Altaf Salim) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో ఫహద్ ఫాసిల్(Fahad Faasil) హీరోగా నటిస్తున్నారు. అయితే ఇందులో రేవతి పిళ్లై, ధ్యాన్ శ్రీనివాసన్, లాల్, వినయ్ ఫోర్ట్, సురేష్ కృష్ణ, బాబు ఆంటోని, జానీ ఆంటోని, లక్ష్మీ గోపాలస్వామి కూడా సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆషిక్ ఉస్మాన్ నిర్మించిన ఈ చిత్రానికి జస్టిన్ వర్గీస్ సంగీతం అందిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఇక ఇందులో ఫహద్ పెళ్లి కొడుకు గెటప్‌లో గుర్రంపై కూర్చొని ఉండగా.. కళ్యాణి ప్రియదర్శన్ మాత్రం షాక్ అవుతూ కనిపించింది. ఇక ఈ పోస్టర్ షేర్ చేస్తూ ఆమె ‘‘పెళ్లి వరకు వారి ప్రేమకథ ఖచ్చితంగా ఉంది. అల్తాఫ్ సలీం హెల్మ్, ఫహద్ ఫాసిల్, కళ్యాణి ప్రియదర్శన్, రేవతి పిళ్లై నటించిన ‘ఒడుం కుతిర చాడుం కుతిర’ అధికారిక ఫస్ట్ లుక్‌ని ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ రివీల్ చేయడం గర్వంగా ఉంది’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.






