లంగా ఓణిలో మెస్మరైజ్ చేస్తున్న మెగా బ్యూటీ.. జస్ట్ డైమండ్ అంతే అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-27 05:05:20  IST  )

యంగ్ హీరోయిన్ అషికా రంగనాథ్(Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

లంగా ఓణిలో మెస్మరైజ్ చేస్తున్న మెగా బ్యూటీ.. జస్ట్ డైమండ్ అంతే అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ అషికా రంగనాథ్(Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన ‘అమిగోస్’(Amigos) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా కింగ్ నాగార్జున(Nagarjuna) సరసన ‘నా సామి రంగా’(Na Saami Ranga) చిత్రంతో పాటు కోలీవుడ్ స్టార్ సిద్ధార్థ్ మూవీ మిస్ యూలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న ‘విశ్వంభర’(Vishwambhara) సినిమాలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో తన గ్లామర్ డోస్‌తో అమాంతం కుర్రకారును రెచ్చగొతున్న అషికా తాజాగా తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఆరెంజ్ కలర్ లంగా ఓణిలో క్యూట్ స్టిల్స్‌ ఇచ్చింది. మెడలో చోకర్, పాపిట బిళ్ళ, గాజులు, ఉంగరం పై పెట్టుకుని చాలా సంప్రదాయకంగా రెడీ అయింది. ఇక వాటిని షేర్ చేస్తూ.. ‘జీవితం నీకు టాంజెరిన్లు ఇచ్చినప్పుడు’ అనే క్యాప్షన్ పెట్టింది. దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు జస్ట్ డైమండ్ అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ బ్యూటీ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Next Story