రెడ్ మిర్చిలా హీటెక్కిస్తున్న మెగా బ్యూటీ.. బోల్డ్ కామెంట్స్‌తో రెచ్చిపోతున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |

‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

రెడ్ మిర్చిలా హీటెక్కిస్తున్న మెగా బ్యూటీ.. బోల్డ్ కామెంట్స్‌తో రెచ్చిపోతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా ఈ భామ బాలకృష్ణ(Balakrishna) సరసన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాలో నటించింది. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో విందును వడ్డిస్తున్నది ప్రగ్యా జైస్వాల్. అలా ప్రతి రోజు వెరైటీ డ్రెసెస్‌తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రగ్యా తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ ఫ్రాక్ వేసుకుని స్టైలీష్‌గా రెడీ అయింది. అంతేకాకుండా తన కొంటె చూపుతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతుంది.

రెడ్ కలర్ డ్రెస్సులో హాట్ మిర్చిలా హీట్ పుట్టిస్తోంది. ఇక ఈ ఫొటోస్ షేర్ చేస్తూ.. ‘నాకు ఇష్టమైన రంగులో ఒక రాత్రి, మళ్లీ’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ఫొటోలు కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు గ్లామరస్ క్వీన్, రెడ్ ఇన్ బ్యూటీ, ఎందుకు అలా పిచ్చెక్కిస్తున్నావు అని, ఆఫర్ల కోసం బాగానే కథలు పడుతున్నావంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story