ట్రెండీ లుక్‌లో ఆకట్టుకుంటున్న మెగా బ్యూటీ.. గ్లామరస్ క్వీన్ అంటున్న నెటిజన్లు(పోస్ట్)

by I. Sairam |

‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

ట్రెండీ లుక్‌లో ఆకట్టుకుంటున్న మెగా బ్యూటీ.. గ్లామరస్ క్వీన్ అంటున్న నెటిజన్లు(పోస్ట్)
X

దిశ, సినిమా: ‘కంచె’(Kanche) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal).. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా ఈ భామ బాలకృష్ణ(Balakrishna) సరసన ‘డాకు మహారాజ్’(Daku Maharaj) సినిమాలో నటించింది.

బాబి కొల్లి(Bobby Kolli) దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా(urvashi Rautela) ఐటెం సాంగ్‌లో చిందులేసింది. అయితే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం కలెక్షన్ల విషయంలో మంచి వసూళ్లు సాధిస్తోంది ఈ సినిమా. దీంతో ఈ మూవీ టీమ్ అంతా ప్రజెంట్ సక్సెన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో విందును వడ్డిస్తున్నది ప్రగ్యా జైస్వాల్. అలా ప్రతి రోజు వెరైటీ డ్రెసెస్‌తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా ప్రగ్యా తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ లెహంగా వేసుకొని స్టైలీష్‌గా రెడీ అయింది. అంతేకాకుండా తన కొంటె చూపుతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతుంది. ఇక ఈ ఫొటోస్ షేర్ చేస్తూ.. ‘ప్రజెంట్ నా హాబీ.. ఎప్పుడూ తిరుగుతూ ఉండటం’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ఫొటోలు కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు గ్లామరస్ క్వీన్, బ్లూ ఇన్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story