Mega 158: రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న 'మెగా 158'. ఆ తేదీ నుండి షూటింగ్ ప్రారంభం

by Pulgam srinivas |

మెగా 158 చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను రేపు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం.

Mega 158: రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న మెగా 158. ఆ తేదీ నుండి షూటింగ్ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో త్వరలోనే ఓ భారీ చిత్రం ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడగా, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను రేపు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీన్ ప్రొడక్షన్స్ బ్యానర్ వారు నిర్మించనుండగా, ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మూవీ టీమ్ రక్తం మరియు గొడ్డలితో ఉన్న పోస్టర్‌ను ఫస్ట్ లుక్‌గా విడుదల చేసింది.

ఆ పోస్టర్‌ను బట్టి ఈ చిత్రం పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి–బాబి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’తో టాలీవుడ్‌ రీజనల్ ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నారు. ప్రస్తుతం ఆయన మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంబర చిత్రంలో నటిస్తున్నారు.

Next Story