'మెగా 158' లుక్ టెస్ట్ కంప్లీట్

by Pulgam srinivas |

'మెగా 158' మూవీ లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తయినట్లు మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

మెగా 158 లుక్ టెస్ట్ కంప్లీట్
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడి చాలా రోజులైంది. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 'మెగా 158' అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైన తర్వాత కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ వారు రూపొందించిన జన నాయగన్ చిత్రం కారణంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యాయని, అలాగే 'మెగా 158' సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని కూడా ఒక దశలో వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలను మూవీ బృందం ఖండించింది.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన సూపర్ సాలిడ్ అప్‌డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మూవీ బృందం ఒక ఫోటోను విడుదల చేసి 'మెగా 158' చిత్రానికి సంబంధించిన లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తయ్యిందని, అది అద్భుతమైన ఆనందాన్ని కలిగించిందని వెల్లడించింది. అలాగే మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తం మరియు రెగ్యులర్ షూటింగ్ అప్‌డేట్స్‌ను కూడా ప్రకటించనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. ఇప్పటికే చిరంజీవి – బాబి కొల్లి కాంబినేషన్‌లో రూపొందిన వాల్తేరు వీరయ్య మంచి విజయాన్ని సాధించిన నేపథ్యంలో, ఈ కొత్త సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.




Next Story