- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mega 158: అనశ్వర రాజన్ ఫిక్స్.. 25 రోజుల కోసం అన్ని డేస్ బ్లాక్
చిరంజీవి, బాబి కొల్లి కాంబోలో స్టార్ట్ కాబోయే సినిమాలో అనశ్వర రాజన్, చిరంజీవికి కూతురు పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈమెపై 25 రోజుల షూటింగ్ కోసం 40 డేట్స్ తీసుకున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, బాబి కొల్లి కాంబోలో కొంతకాలం క్రితం వాల్టేరు వీరయ్య అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వచ్చింది. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మరికొన్ని రోజుల్లోనే వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమాకు కోన వెంకట్ కూడా కథ, స్క్రీన్ ప్లే విషయంలో బాబీకి సహాయం చేస్తున్నాడు. కోన వెంకట్ కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఈసారి చిరంజీవి గారితో బాబీ చేయబోయే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది, అది ఇప్పటివరకు చిరంజీవి గారు తన కెరీర్లో చేయని తరహా సినిమా అని చెప్పుకొచ్చాడు.
ఈ చిత్రంలో ప్రియమణి, చిరుకి జోడిగా నటించే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ నటి అనశ్వర రాజన్, చిరంజీవికి కూతురు పాత్రలో ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ముద్దుగుమ్మపై దాదాపు 25 రోజులపాటు షూటింగ్ నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు, కానీ ఈమెకు సంబంధించిన 40 రోజుల డేట్స్ ఈ మూవీ యూనిట్ తీసుకున్నట్లు, దానితో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన పాత్రను ముగించాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా గనుక మంచి విజయం సాధించినట్లయితే ఈ యువ నటికి తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు దక్కే అవకాశం ఉంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలోనే ఛాంపియన్, విత్ లవ్ అనే రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండింటిలో ఛాంపియన్ ప్రేక్షకులను నిరాశపరిచిన విత్ లవ్ మాత్రం జనాలను బాగానే ఆకట్టుకుంది.






