- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mega-157: సైలెంట్‌గా అక్కడ స్టార్ట్ అయిన మెగా-157 షూటింగ్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ‘మెగా-157’ వర్కింట్ టైటిల్‌తో రాబోతున్న ఈ యాక్షన్ కామెడీ మూవీని షైన్ స్క్రీన్ , గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, అర్యన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి(Sahu Garapati), చిరు పెద్ద కూతురు సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇక ఇందులో మెగాస్టార్ శంకర వరప్రసాద్ పాత్రలో నటించనున్నారు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నట్లు రీసెంట్‌గా మూవీ టీమ్ క్లారిటీ ఇస్తూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను కూడా షేర్ చేసి సినీ ప్రియులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన మరో న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. నిన్న హైదరాబాద్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మొదటి రోజు డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. అనిల్ రావిపూడి లానే చిరంజీవి కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో ఆసక్తిగా ఉన్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.






