- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Meenakshi Chaudhary : ఉదయం ముద్దు పెట్టుకున్నట్లు, రాత్రి వారితో ఉన్నట్లు అనిపించింది.. హీరోయిన్ క్రేజీ పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి సుపరిచితమే. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి సుపరిచితమే. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన యాక్టింగ్కు మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా వచ్చిన ఖిలాడీ మూవీలో అవకాశం దక్కించుకుంది. ఈ మూవీలో మీనాక్షి చౌదరి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. మాస్ సాంగ్కు స్టెప్పులేసి అదరహో అనిపించిందనడంలో అతిశయోక్తిలేదు. ఘాటు అందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. తర్వాత అడివి శేష్ సరసన హిట్ 2 లో అవకాశం కొట్టేసింది.
కెరీర్ ప్రారంభంలో కాస్త తక్కువ సినిమా చాన్సులు వచ్చినప్పటికీ.. ఈ బ్యూటీ నెటిజన్ల మనసు దోచుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారంలో నటించి మెప్పించింది. వీటితో పాటుగా విశ్వక్ సేన్, వరుణ్, దుల్కర్ సల్మాన్ కథానాయకుల సరసన కూడా నటించింది. ఇకపోతే ఈ బ్యూటీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల్ని అలరిస్తుంటుంది.
ఈ బ్యూటీ ఓ వైపు సినిమాల్లో వరుస అవకాశాలు సంపాదించుకుంటూ.. ఫుల్ బిజీగా గడిపేస్తున్నప్పటికీ.. సోషల్ మీడియాలోని అభిమానులతో మాత్రం టచ్‌లో ఉంటుంది. తరచూ ఏదో ఒక పోస్ట్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది. అయితే తాజాగా మీనాక్షి నెట్టింట ఓ పోస్ట్ పంచుకుంది. ‘‘ఉదయం సూర్యుడిని ముద్దు పెట్టుకున్నట్లు, రాత్రి నక్షత్రాల మధ్య ఉన్నట్లు అనిపించింది’’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చి.. తన ఫొటోలను షేర్ చేసింది.






