- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నవీన్ పొలిశెట్టిపై హీరోయిన్ కామెంట్స్
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా జనవరి 14న థియేటర్లలోకి రాబోతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.

దిశ, సినిమా : నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా జనవరి 14న థియేటర్లలోకి రాబోతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. రిలీజ్ దగ్గర పడటంతో ఇందుకు సంబంధించిన విశేషాలు పంచుకుంది హీరోయిన్ మీనాక్షి. ‘ఈ సినిమాలో నా పాత్ర పేరు చారులత. సంపన్న కుటుంబంలో పుట్టిన తండ్రి గారాల పట్టి లాంటి పాత్ర. ఇంట్లో యువరాణిలా పెరుగుతుంది. చాలా మంచి అమ్మాయి. అమాయకంగా, సున్నితమైన మనసు కలిగి ఉంటుంది. క్యూట్‌గా బిహేవ్ చేస్తుంది. నన్ను పూర్తి కామెడీ పాత్రలో చూడబోతున్నారు. డైరెక్టర్ ఇచ్చిన ఇన్ పుట్స్.. నాకున్న అవగాహనను బట్టి ఈ పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాను. నవీన్‌తో వర్క్ చేయడం .. సినిమా టీచింగ్ స్కూల్‌లా ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో కామెడీ ఒకలా ఉంటే, నవీన్ కామెడీ మరోలా ఉంటుంది. పంచ్ డైలాగ్స్ కరెక్ట్ టైమింగ్‌లో చెప్పడం అనేది ఛాలెంజింగ్‌గా అనిపించింది’ అని తెలిపింది.






