- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Meenakshi Chaudhary: యంగ్ హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్.. ఆహా మీను మేరీ జాను అంటున్న నెటిజన్లు..
ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary).

దిశ, సినిమా: ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ కెరీర్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. గతేడాది ‘ది గోట్’(The Goat)లో మెరిసిన ఈ బ్యూటీ.. ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar)తో బ్లాక్ బస్టర్ హిట్ అందుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam) చిత్రంతో తన గ్రాఫ్ మరింత పెంచుకుంది. ఇందులో మీనుగా తన అందాలతో, యాక్టింగ్‌తో యువకుల గుండెలను కొల్లగొట్టింది. దీంతో టాలీవుడ్‌లో ఈ అమ్మడు గ్రాఫ్ రోజు రోజుకు పెరిగిపోతూ.. వరుస అవకాశాలు దక్కించుకుంటూ హంగామా చేస్తుంది. ఇక ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రంతో పాటు.. రెండు, మూడో ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా అయిపోయింది.
ఇక సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా (Social media)లో మాత్రం ఫుల్ యాక్టీవ్ ఉంటోంది ఈ బ్యూటీ. తన పర్సనల్ విషయాలతో పాటు ప్రోఫిషనల్‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తుంది. ముఖ్యంగా తన అంద చందాలతో కుర్రాలకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటోంది. ఈ క్రమంలోనే ట్రెండీ అవుట్ ఫిట్స్ (Trendy outfits) ధరిస్తూ ఎట్రాక్ట్ చేస్తుంది. ఇందులో భాగంగా.. తాజాగా మీనాక్షీ చౌదరి సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో గ్రీన్ కలర్ శారీలో తన అందాలను చూపిస్తూ క్యూట్‌గా మెస్మరైజ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రజెంట్ వైరల్ కావడంతో.. ఆహా మీను.. మేరీ జాను అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.






