- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Meenakshi Chaudhary: నాకు అలాంటి మొగుడు కావాలి.. మిడిల్ క్లాస్ అమ్మాయి కోరిక
మీనాక్షి చౌదరి తనకు కాబోయే భర్తకు 100 ఎకరాల ఆస్తి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె 'ఈచట వాహనములు నిలపరాదు' అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ఈమె రవితేజ హీరోగా రూపొందిన 'ఖిలాడి'లో నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఇందులో మీనాక్షి తన అందాలను భారీ స్థాయిలో ఆరబోసింది. దానితో ఒక్కసారిగా ఈమెకు గుర్తింపు వచ్చింది.
ఆ తర్వాత వరుస పెట్టి మీనాక్షికి తెలుగులో అవకాశాలు దక్కుతున్నాయి. ఇప్పటివరకు ఈ నటి చాలా సినిమాల్లో నటించినా విజయాల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది. ఈమెకు నటిగా మంచి గుర్తింపును తీసుకువచ్చిన సినిమాలలో లక్కీ భాస్కర్ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఆ తర్వాత ఈమెకు 'సంక్రాంతికి వస్తున్నాం', 'హిట్ ది సెకండ్ కేస్' సినిమాల ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈమె 'అనగనగా ఒక రాజు' అనే మూవీతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకు కాబోయే భర్తకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనేది చెప్పుకొచ్చింది. మీనాక్షి మాట్లాడుతూ... "నాకు కాబోయే భర్తకు పెద్ద పెద్ద బిజినెస్లు ఉండాల్సిన అవసరం లేదు, కోట్లల్లో సంపాదించాల్సిన అవసరం లేదు. అతను వ్యవసాయం చేస్తే సరిపోతుంది, కానీ అతనికి 100 ఎకరాల భూమి ఉండాలి. వంట బాగా చేయాలి, బట్టలు ఉతకాలి, ఇంటి పనులన్నీ చూసుకోవాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి నాకు భర్తగా రావాలని ఈ బ్యూటీ కోరుకుంటున్నట్లు తెలుస్తుంది."






