- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోహన్ బాబు సినీ ప్రయాణానికి 50 ఏళ్లు
ప్రముఖ నటుడు, నిర్మాత పద్మశ్రీ డాక్టర్ ఎం. మోహన్ బాబు 50ఏళ్ల సినీ ప్రయాణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ పార్క్ హయత్‌లో జరిగిన ఈ MB50 వేడుకలకు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, దిగ్గజ వ్యాపారవేత్తలు, సన్నిహితులు హాజరయ్యారు

దిశ, సినిమా : ప్రముఖ నటుడు, నిర్మాత పద్మశ్రీ డాక్టర్ ఎం. మోహన్ బాబు 50ఏళ్ల సినీ ప్రయాణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ పార్క్ హయత్‌లో జరిగిన ఈ MB50 వేడుకలకు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, దిగ్గజ వ్యాపారవేత్తలు, సన్నిహితులు హాజరయ్యారు. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో మోహన్ బాబుకు గత దశాబ్దాలుగా ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. ఆ ప్రేమకు, స్నేహానికి చిహ్నంగా MB50 వేడుకల్లో రజినీకాంత్ ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ఎందరో రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీరందరూ కూడా మోహన్ బాబు గారికి శుభాకాంక్షలు తెలిపారు. మోహన్ బాబు కుమారుడు, డైనమిక్ స్టార్ విష్ణు మంచు ఈ కార్యక్రమాన్ని ఎంతో గ్రాండ్‌గా నిర్వహించారు.సినీ పరిశ్రమ నుంచి బ్రహ్మానందం, హరీష్ శంకర్, టీజీ విశ్వ ప్రసాద్, అల్లు అరవింద్, దిల్ రాజు, మైత్రి శశి, జయసుధ,నాని, నాజర్, ఆది సాయి కుమార్, సందీప్ కిషన్, వీకే నరేష్, గోపీచంద్, శ్రీకాంత్, శ్రీను వైట్ల, శ్రీకాంత్ ఓదెల వంటి వారు ఈ వేడుకలో పాల్గొన్నారు.






