MAX MOVIE: ఓటీటీలో కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

by Gugulothu.Kavitha |

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kicha Sudeep) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

MAX MOVIE: ఓటీటీలో కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kicha Sudeep) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ‘ఈగ’(Ega) సినిమాలో విలన్ క్యారెక్టర్‌లో నటించి టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నాడు. దీంతో సుదీప్‌ ‘బాహుబలి’(Bahubali)లో కూడా చాన్స్‌ దక్కించుకున్నారు. అలా భారీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే రీసెంట్‌గా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మ్యాక్స్'(Max).

విజయ్ కార్తికేయ(Vijay Karthikeya) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sharath Kumar) హీరోయిన్‌గా నటించింది. అయితే కిచ్చా క్రియేషన్స్‌తో కలిసి వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్. థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక గత ఏడాది డిసెంబర్ 25న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అలా బాక్సాఫీస్ వద్ద రూ.60 కోట్ల వసూళ్లను కూడా రాబట్టింది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.

మ్యాక్స్ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినటువంటి జీ5(ZEE5)లో ఫిబ్రవరి 22న తేదీ నుంచి కన్నడలో అందుబాటులోకి రానుంది. కాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు జీ5 ఆన్సర్ ఇస్తూ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించడం విశేషం. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పటి వరకు ఈ సినిమా చూడని వాళ్లు ఫిబ్రవరి 22 నుంచి జీ5లో ఈ మూవీని చూసేయొచ్చు.

Next Story