- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పెద్ది’ నుంచి మరో అదిరిపోయే సాంగ్
‘పెద్ది’ నుంచి మరో అదిరిపోయే సాంగ్ వచ్చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా చేస్తున్న సినిమా పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జూన్ 4వ తేదీన రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో రామ్ చరణ్ హీరోగా చేస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా మెరువనున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్.. అంచనాలను అమాంతం పెంచేసింది.
ఇలాంటి తరుణంలో ఈ మూవీ నుంచి క్రేజీ మ్యూజికల్ అప్డేట్ కూడా వచ్చేసింది. సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మస్సా మస్సా అంటూ సాగే ఆడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటతో పాటు చికిరి చికిరి, రయ్ రయ్ రారా, హల్లల్లలో లాంటి పాటలను ఒకే చోట వినేలా ఆడియో జ్యూక్ బాక్స్ కూడా చిత్ర బృందం రిలీజ్ చేసింది. కాగా ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత స్వరాలు అందించిన సంగతి తెలిసిందే.
"పెద్ది" మూవీ...ప్రధాని మోడీతో రామ్ చరణ్ చర్చలు !
Next Story






