"పెద్ది" మూవీ...ప్ర‌ధాని మోడీతో రామ్ చరణ్ చ‌ర్చ‌లు !

by velandi.Saikiran |   (  Updated:2026-05-28 14:40:21  IST  )

'పెద్ది' మూవీ గురించి ప్ర‌ధాని మోడీతో చ‌ర్చించిన‌ట్లు రామ్ చరణ్ వెల్ల‌డించారు.

పెద్ది మూవీ...ప్ర‌ధాని మోడీతో రామ్ చరణ్ చ‌ర్చ‌లు !
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అందరిని ఆకట్టుకున్నాయి. జూన్ 4వ తేదీన పెద్ది మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అంతకంటే ముందు రోజు రాత్రి ప్రీమియర్లు పడనున్నాయి. దీంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది చిత్ర బృందం. దేశ వ్యాప్తంగా స్వయంగా రామ్ చరణ్ తిరుగుతూ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఢిల్లీలో గ్రాండ్ గా ఓ ప్రెస్ మీట్ కూడా చిత్ర బృందం నిర్వహించింది.

ఈ సందర్భంగా రామ్ చరణ్ పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గతంలో తాను ఢిల్లీకి వచ్చినప్పుడు, ప్రధాని నరేంద్ర మోడీని కలిసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తన పెద్ది సినిమా విషయాలను ప్రధాని నరేంద్ర మోడీ అడిగి తెలుసుకున్నట్లు వివరించారు. ఇది భారత దేశ మూలాలు, సంస్కృతిని ప్రతిబింబించే సినిమా అని మోడీతో చెప్పినట్లు స్పష్టం చేశారు చ‌ర‌ణ్‌. ఇది పక్క వికసిత్ భార‌త్ సినిమా అని ఆయనకు వివరంగా చెప్పినట్లు తెలిపారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన మహమ్మద్.. భారత ఫుట్ బాల్ జట్టుకు ఆడాడని అతడి స్ఫూర్తితోనే నేడు ఆ గ్రామం నుంచి 85 మందికి పైగా ప్లేయర్లు పుట్టుకు వచ్చారని మోడీ ఈ సందర్భంగా తనతో వివరించినట్లు చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్లిక్

‘పెద్ది’ నుంచి మ‌రో అదిరిపోయే సాంగ్

Next Story