Tribanadhari Barbarik: సినిమాపై స్పెషల్ క్రేజ్ క్రియేట్ చేసిన ఉదయ భాను.. ఫొటోలు వైరల్

by Chukka Sudharani |

కొత్త పాయింట్, కాన్సెప్ట్‌తో రాబోతోన్న లేటెస్ట్ మూవీ ‘త్రిబాణధారి బార్బరిక్’.

Tribanadhari Barbarik: సినిమాపై స్పెషల్ క్రేజ్ క్రియేట్ చేసిన ఉదయ భాను.. ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: కొత్త పాయింట్, కాన్సెప్ట్‌తో రాబోతోన్న లేటెస్ట్ మూవీ ‘త్రిబాణధారి బార్బరిక్’. వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీని స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మిస్తున్నారు. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, గ్లింప్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ఓ మాస్ నంబర్‌ను వదిలారు.

‘ఇస్కితడి ఉస్కితడి’ అంటూ సాగే ఈ పాటను రఘురామ్ రచించగా.. రాహుల్ సిప్లిగంజ్ పాడి అందరిలో మరింత ఉత్సాహాన్ని నింపాడు. ఈ స్పెషల్ సాంగ్‌లో ఉదయ భాను తన స్టెప్పులతో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచి అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకోగా.. త్వరలో రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు చిత్ర బృందం. కాగా.. ఈ చిత్రంలో సత్యరాజ్‌తో పాటు సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story