క్రిస్మస్ స్పెషల్‌గా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి మాస్ మహారాజా క్రేజీ పోస్టర్ రిలీజ్..

by I. Sairam |

మాస్ మహారాజ రవితేజ(Raviteja) కిశోర్‌ తిరుమల(Kishore Tirumala) దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bartha Mahashayulaku Vignapthi).

క్రిస్మస్ స్పెషల్‌గా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి మాస్ మహారాజా క్రేజీ పోస్టర్ రిలీజ్..
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ(Raviteja) కిశోర్‌ తిరుమల(Kishore Tirumala) దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bartha Mahashayulaku Vignapthi). ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్(Ashika Ranganath), డింపుల్ హయతి(Dimple Hayathi) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుండగా.. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్‌డేట్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అయితే నేడు క్రిస్మస్ సందర్భంగా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా మూవీ టీమ్ స్పెషల్ విష్ చేసింది.

ఈ మేరకు క్రేజీ పోస్టర్‌ను షేర్ చేస్తూ ట్విట్ చేసింది. ‘BMW టీం మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది.. ఈ సంక్రాంతికి, వినోదం కొత్త C/O చిరునామాను కలిగి ఉంటుంది.. భర్త మహాశయులకు విజ్ఞప్తి జనవరి 13, 2026న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో రవితేజ స్టెప్స్ మీద కూర్చొని క్రిస్మస్ కాస్టూమ్స్‌లో కనిపించారు. రెడ్ కలర్ లగేజ్ బ్యాగ్‌తో మొత్తం థీమ్ అంతా అదే కలర్‌తో ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story