‘మాస్ జాతర’ టీజర్ అప్‌డేట్.. పోస్టర్‌తోనే ఫైర్ తెప్పిస్తున్నారుగా..

by I. Sairam |

మాస్ మ‌హారాజ రవితేజ(Raviteja) హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర'(Mass Jathara).

‘మాస్ జాతర’ టీజర్ అప్‌డేట్.. పోస్టర్‌తోనే ఫైర్ తెప్పిస్తున్నారుగా..
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మ‌హారాజ రవితేజ(Raviteja) హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర'(Mass Jathara). భాను భోగ వరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ(Surya Devaravamsi), సాయి సౌజ‌న్య(Sai Soujanya) నిర్మిస్తున్నారు. ఇక ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఆగ‌ష్టు 27న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

ఈ సంద‌ర్భంగా వరుస ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టిన చిత్ర‌యూనిట్.. నేడు రాఖీ పండుగా సంద‌ర్భంగా మూవీ నుంచి టీజ‌ర్ అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఇందులో భాగంగా ఈ మూవీ టీజ‌ర్‌ను ఆగ‌ష్టు 11న ఉద‌యం 11.08 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం తెలిపింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది. ఇక పోస్టర్‌లో రవితేజ గాగూల్స్ పై టీజర్ అని ఫైర్‌తో రాసి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story