Mass Jatara: ఆ స్పెషల్‌ డే కానుకగా ‘మాస్ జాతర’ నుంచి టీజర్..? వైరల్ అవుతున్న న్యూస్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) ప్రస్తుతం హిట్స్, ప్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

Mass Jatara: ఆ స్పెషల్‌ డే కానుకగా ‘మాస్ జాతర’ నుంచి టీజర్..? వైరల్ అవుతున్న న్యూస్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) ప్రస్తుతం హిట్స్, ప్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా భాను భోగవరపు(Bhanu Bhogavarapu) డైరెక్షన్‌లో 75వ సినిమాగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’(Mass Jatara). యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ(Suryadevara naga vamsi), సాయి సౌజన్య(Sai Sowjanya) కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా మే9న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. రవితేజ పుట్టిన రోజు(జనవరి 26న) కానుకగా ఈ సినిమా నుంచి సాలీడ్ అప్డేట్ రానున్నట్లు సమాచారం. బర్త్‌డే స్పెషల్‌లో భాగంగా టీజర్‌ కట్‌(Teaser Cut)ని మేకర్స్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలోనే రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.

Next Story