Vishwak Sen: పార్టీ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్న మాస్ కా దాస్.. క్యూరియాసిటీ పెంచుతున్న టైటిల్ పోస్టర్‌

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-11 06:35:23  IST  )

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.

Vishwak Sen: పార్టీ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్న మాస్ కా దాస్.. క్యూరియాసిటీ పెంచుతున్న టైటిల్ పోస్టర్‌
X

దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. హిట్, ఫ్లాప్ అని పట్టించుకోకుండా బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్నాడు. అయితే ఆయనకు గత కొద్ది రోజుల నుంచి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఇటీవల విశ్వక్ నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. దీంతో ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చి ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ ‘ఫంకీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అలాగే ఓ వైపు కథలు వింటూనే మరో వైపు తాను ఓ కథలు రాసుకున్నాడు. తాజాగా, విశ్వక్ సేన్ కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. మాస్ కా దాస్ స్వయం దర్శకత్వంలో రాబోతున్న థర్డ్ మూవీ ‘కల్ట్’(Cult). ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమంతో పాటు షూటింగ్ కూడా నేడు ప్రారంభం అయినట్లు తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇందులో బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఓ వ్యక్తి ఉండగా.. ఓ మాస్క్ ధరించి కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరిలో క్యూరియాసిటీని పెంచడంతో పాటు భయంకరంగా ఉండి గూస్ బంప్స్‌ను తెప్పిస్తోంది.

అయితే ఈ మూవీ పూజా కార్యక్రమానికి నిర్మాతలు అల్లు అరవింద్(Allu Aravind), హారిక, హాసిని చినబాబు హాజరయ్యారు. అయితే ఈ చిత్రాన్ని తారక్ సినిమాస్, వణ్మయి క్రియేటిన్స్ బ్యానర్స్‌పై కరాటే రాజు, సందీప్ కాకరాల నిర్మిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమా ద్వారా విశ్వక్ ఓ 40 మంది కొత్త నటీనటులను పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ ‘కల్ట్’ మూవీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, స్పానిష్. జాపనీస్ భాషల్లో విడుదల కాబోతుంది.

Next Story