రాజాసాబ్ చేసింది నేనే.. నెటిజెన్ కు దర్శకుడు స్ట్రాంగ్ కౌంటర్

by velandi.Saikiran |

ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ కానుంది.

రాజాసాబ్ చేసింది నేనే.. నెటిజెన్ కు దర్శకుడు స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో ప్రభాస్ హీరోగా చేయగా మారుతి దర్శకత్వం వహించారు. కామెడీ, హారర్ నేపద్యంలో ఈ సినిమా రానుంది. అయితే, సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రెండో ట్రైలర్ రిలీజ్ చేసి అందరిని సర్ ప్రైజ్ చేసింది చిత్రం బృందం. ఈ మూవీ రెండో ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇక ఈ సినిమా ట్రైలర్ 2.0పై ఓ నెటిజన్ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ మూవీస్ నిజంగానా మారుతీ తీశారా? నమ్మలేకపోతున్నాం అంటూ పేర్కొన్నాడు. అయితే ఆ నెటిజెన్ చేసిన పోస్టుకు దర్శకుడు మారుతి రియాక్ట్ అయ్యారు. ఈ సినిమా తీసింది నేనే బ్రదర్.. మీ అందరికీ డిఫరెంట్ స్టోరీ అందించేందుకు, చాలా కష్టపడ్డాను అంటూ వెల్లడించారు. తనపై నమ్మకం గురించి అవకాశం ఇచ్చిన ప్రభాస్ కు కృతజ్ఞతలు కూడా చెప్పారు. తమన్, నిర్మాత విశ్వప్రసాద్ సహకారం ఈ ప్రాజెక్టును ఓ రేంజ్ కు తీసుకు వెళ్లినట్లు తెలిపారు. దీంతో మారుతి పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.



Next Story