Marthand K. Venkatesh: తారక్ మూవీ ఫ్లాప్ అవుతుందని ముందే చెప్పాను.. కానీ దర్శకుడు వినలేదు

by Pulgam srinivas |

మార్తాండ్ కె. వెంకటేష్ మాట్లాడుతూ... ఆంధ్రావాలా సినిమా ఆడదని ముందుగానే పూరి జగన్నాథ్ కి చెప్పినట్లు వెల్లడించారు.

Marthand K. Venkatesh: తారక్ మూవీ ఫ్లాప్ అవుతుందని ముందే చెప్పాను.. కానీ దర్శకుడు వినలేదు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ ఎడిటర్‌గా గుర్తింపు పొందిన మార్తాండ్ కె. వెంకటేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా దర్శకుడు పూరి జగన్నాథ్ తో తనకు ఉన్న అనుభవాలను గుర్తుచేసుకున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్ మాట్లాడుతూ... “నా కెరీర్‌లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలకు పని చేశాను. ఆయన చాలా ఓపెన్ మైండెడ్ వ్యక్తి. ఎలాంటి అభిప్రాయం చెప్పినా పాజిటివ్‌గా తీసుకుంటారు. అందుకే మాకు కూడా మంచి స్వేచ్ఛ లభించేది” అని తెలిపారు.

అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఆంధ్రావాలా సినిమా గురించి మాట్లాడుతూ... “ఎడిటింగ్ రూమ్‌లో సినిమా చూసిన తర్వాత ఇది పెద్దగా ఆడకపోవచ్చని పూరి జగన్నాథ్ గారికి చెప్పాను. చివరకు ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయింది” అని పేర్కొన్నారు. ఇక నాగార్జున హీరోగా రూపొందిన సూపర్ విషయంలో కూడా తాను కొంత నిరాశ చెందానని చెప్పారు. “సినిమాలో ఖరీదైన బైకులు వాడము, సినిమా ఎందుకు జనాలకు నచ్చదని పూరి గారు నన్ను అడిగారు. దానికి నేను... ప్రేక్షకులు నాగార్జున గారిని చూడటానికే థియేటర్‌కు వస్తారు కానీ లక్షలు ఖర్చు చేసిన బైకులు సాధారణ ప్రేక్షకుడికి పెద్దగా కనెక్ట్ కావని చెప్పాను” అని వెల్లడించారు. చివరగా పూరి జగన్నాథ్‌తో పని చేసిన అనుభవం ఎంతో సంతోషంగా ఉంటుందని, ఆయన ప్రతి విషయాన్ని సానుకూలంగా స్వీకరించడం వల్ల తమలాంటి టెక్నీషియన్ల పని మరింత సులువవుతుందని మార్తాండ్ కె. వెంకటేష్ తెలిపారు.

Next Story