‘మర్దానీ-3’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ పండుగ కానుకగా రాబోతుందంటూ మేకర్స్ పోస్ట్

by Mallepaka Hamsa |

అభిరాజ్ మినావాలా(Abhiraj Minawala) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మర్దానీ-3’(Mardaani-3). ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను గోపీ పుత్రన్, ఆదీత్యా చోప్రా నిర్మిస్తున్నారు.

‘మర్దానీ-3’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ పండుగ కానుకగా రాబోతుందంటూ మేకర్స్ పోస్ట్
X

దిశ, సినిమా: అభిరాజ్ మినావాలా(Abhiraj Minawala) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మర్దానీ-3’(Mardaani-3). ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను గోపీ పుత్రన్, ఆదీత్యా చోప్రా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా మర్దానీ ఫ్రాంచైజీలో చీకటి, ఘోరమైన, క్రూరమైన అధ్యాయం ‘మర్దానీ-2’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే వచ్చిన రెండు భాగాలు హిట్ కావడంతో.. ‘మర్దానీ-3’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ (Rani Mukherjee)హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లు టాక్. అయితే ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, ‘మర్దానీ-3’ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుపుతూ మూవీ మేకర్స్ డబుల్ అప్డేట్ ఇచ్చారు. రాణి ముఖర్జీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేస్తూ ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే మార్చి 4న హోళి పండుగ కానుకగా దీనిని ఆ డేట్‌కు తీసుకురాబోతున్నట్లు కూడా తెలిపారు. ఇక ఇందులో ఆమె శివానిశివరాజ్‌రాయ్ భయంలేని కాప్‌గా నటిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాణి ముఖర్జీ గన్ పట్టుకుని ఎవరికో గురి పెట్టినట్లుగా ఉన్న పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story