ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానంటూ ‘వార్-2’ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) నటిస్తున్న తాజా చిత్రం ‘వార్-2’(War-2). అయితే ఇందులో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానంటూ ‘వార్-2’ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) నటిస్తున్న తాజా చిత్రం ‘వార్-2’(War-2). అయితే ఇందులో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee) దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ సూపర్ హిట్ ‘వార్’ సీక్వెల్‌గా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 14న థియేటర్స్‌లో రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘వార్-2’ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ సోషల్ మీడియా ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ‘‘మరికొన్ని వారాల్లో మా సినిమా మీ ముందుకు రాబోతుంది. ఈ మూవీ గురించి మీకు ఆసక్తికర విషయాలు చెప్పడానికి ఇదే సరైన సమయం అనిపిస్తోంది.

వార్-2 రూపొందించడానికి నాలో స్ఫూర్తినింపిన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ స్క్రిప్ట్ వినగానే ఆశ్చర్యపోయాను. అదే ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్రధాన కారణం. అయితే ఈ మూవీ రూపొందిస్తున్న సమయంలో ఎన్నో సవాళ్లు కూడా ఎదురయ్యాయి. కథ గురించి అందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా స్నేహితురాలు కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నాను. ఇందులో ఆమె చాలా అద్భుతంగా నటించింది. అలాగే ఈ రెండు సంవత్సరాల్లో ఆదిత్య చోప్రా నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అలాగే ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లతో కలిసి పని చేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది’’ అని రాసుకొచ్చారు. అలాగే ఎన్టీఆర్, కియారా అద్వానీ, హృతిక్ రోషన్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు జై ఎన్టీఆర్ అని కామెంట్లు పెడుతున్నారు.

Next Story