- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నన్ను ఎక్కువగా ప్రేమించే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు’.. నెట్టింట వైరల్ అవుతోన్న నటి పోస్ట్
నటి మానుషి చిల్లర్ (Manushi Chillar)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: నటి మానుషి చిల్లర్ (Manushi Chillar)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2017 టైటిల్‌ను గెలుచుకుంది. ఈమె యష్ రాజ్ ఫిల్మ్‌తో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. సామ్రాట్ పృథ్వీరాజ్‌తో సినీ ఎంట్రీ ఇచ్చింది.
తర్వాత అనేక ఆడిషన్లు, ట్రయల్స్ అనంతరం అక్షయ్ కుమార్‌కు భార్య పాత్రలో ఓ సినిమాలో అవకాశం కొట్టేసింది. కానీ ఈ మూవీ బాక్సాఫీసు వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ మానుషి చిల్లర్ మరిన్ని అవకాశాలు సంపాదించుకుంది. ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ అనే కామెడీ సినిమాలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. విక్కి కౌశల్ సరసన నటించింది జనాల్ని ఆకట్టుకుంది.
ఇక తెలుగు, హిందీ ద్విభాషా చిత్రమైన ఆపరేషన్ వాలెంటైన్‌లో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన చిలార్ వింగ్ కమాండర్ పాత్ర పోషించింది. వీటితో పాటుగా టైగర్ ష్రాప్ నటించిన బడే మియాన్ చోటే మియాన్ లో, టెహ్రాన్‌లో జాన్ అబ్రహంకు జోడిగా నటించింది. ఈ అమ్మడు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా మానుషి నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది.
నేడు తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఇలా రాసుకొచ్చింది. ‘‘ నేను సమావేశాలు, డబ్బింగ్, షూట్స్, ఈవెంట్స్, పెయింటింగ్, వర్కౌట్స్, వార్డ్‌రోబ్ ఎంపికలతో సహా హీల్స్ ధరించడం వంటి వాటిని జ్యామిలీ చేస్తూ ఉండవచ్చు. కానీ ఏప్రిల్ నెల మరింత ప్రత్యేకం. ఉత్తమ తల్లికి, ఉత్తమ మహిళకు, నా ప్రాణ స్నేహితురాలికి నన్ను ఎక్కువగా ప్రేమించే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు నేను నిన్ను లైఫ్ టైమ్ ప్రేమిస్తాను’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






