- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Manushi_chhillar: ‘నీలం రంగు వేసుకున్నాను కానీ దానికి పూర్తి విరుద్ధంగా అనిపిస్తోంది’.. నటి ఆసక్తికర పోస్ట్
ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది హీరోయిన్ మానుషి చిల్లర్.

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది హీరోయిన్ మానుషి చిల్లర్. ఈ బ్యూటీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. మాజీ విశ్వసుందరి అయిన ఈ ముద్దుగుమ్మ ఇటు టాలీవుడ్‌లో నటిస్తూనే అటు బాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకుంటుంది. 2017 లో ఈ నటి విశ్వసుందరిగా నిలిచింది. తర్వాత మానుషి చిల్లర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, బడే మియా ఛోటే మియా వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన టెహ్రాన్ మూవీలో కూడా నటించి మెప్పించింది. కథానాయికగా మానుషి చిల్లర్ విభిన్నమైన సినిమాల్లో నటించాలనుకుంటున్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఈ అమ్మడు గురించి సోషల్ మీడియాలో పలు రూమర్స్ కూడా వినిపించాయి. జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా బ్రదర్‌తో ఈ నటి లవ్‌లో ఉన్నారంటూ నెట్టింట గట్టి టాక్ వినిపించింది.
మరీ ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఇదంతా పక్కన పెడితే.. మానుషీ చిల్లర్ అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గ ఉంటుంది. తరచూ ఏదో ఒక పోస్ట్‌తో అభిమానుల్ని పలకరిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. దీనికి డిఫరెంట్ క్యాప్షన్ కూడా జత చేసింది. బ్లూ కలర్ డ్రెస్ ధరించి.. ఫ్రెష్ లుక్‌లో కనిపించిన మానుషి.. ‘‘నీలం రంగు వేసుకున్నాను కానీ దానికి పూర్తి విరుద్ధంగా అనిపిస్తోంది’’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి పోస్ట్ వైరల్ అవుతోంది.






