- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Manushi Chillar: కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులను నమ్మాలి.. మానూషి చిల్లర్ పోస్ట్.. ఎవరిగురించంటే?
ఆర్టిస్ట్ దిల్జిత్ దోసాంజ్ తన 2025 ఆల్బమ్ ఆరా నుండి తాజా పంజాబీ ట్రాక్ కుఫర్ అక్టోబర్ 14న విడుదలైంది.

దిశ, సినిమా: ఆర్టిస్ట్ దిల్జిత్ దోసాంజ్ తన 2025 ఆల్బమ్ ఆరా నుండి తాజా పంజాబీ ట్రాక్ కుఫర్ అక్టోబర్ 14న విడుదలైంది. ఇది రిలీజైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తెచ్చుకుని.. ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో హీరోయిన్ మానేషి చిల్లర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో.. తాజాగా ఈ సాంగ్ హిట్‌పై స్పందిస్తూ.. ‘కొన్నిసార్లు అనుకోని క్షణాలు.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా మారుతాయి.. నేను ఇప్పుడే ఫ్లూ నుండి కోలుకున్నాను.. నిజాయితీగా చెప్పాలంటే ఇప్పుడు నేనున్నా అవతారంలో కెమెరా ముందు ఉండటానికి ఏ విధంగానూ సిద్ధంగా లేను.
కానీ దిల్జిత్ దోసాంజ్ సాంగ్ చేసినప్పుడు.. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు నాపై నమ్మకం ఉంచారు. 6 గంటల్లో కొరియోగ్రఫీ నేర్చుకోవడం నుండి.. సగం రోజులో కాస్ట్యూమ్స్‌ను సెట్ చేసుకోవడం వరకు అన్నీ ఫాస్ట్‌గా జరిగిపోయాయి. ఇలా నాకు తెలియకుండానే షూటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు దీనికి వస్తున్న స్పందన ఎంతో ఎగ్జైటింగ్‌గా అనిపిస్తుంది.. అందుకే కొన్నిసార్లు మిపై నమ్మకం ఉంచే వ్యక్తులను నమ్మి ముందుకు సాగాలి’ అని తెలిపింది మానూషి. లింక్
- Tags
- Manushi Chillar






