- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఈ పోస్ట్‌లోని ప్రతి చిత్రం నాకు ఏదో అర్థాన్నిస్తుంది’.. ఆకట్టుకుంటోన్న ఫొటోలు పంచుకున్న నటి
నటి మానుషి చిల్లర్ ప్రత్యేకంగా అక్కర్లేదు. ఈ బ్యూటీ మిస్ వరల్డ్ 2017 పోటీ విజేత.

దిశ, వెబ్‌డెస్క్: నటి మానుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా చెప్సాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ మిస్ వరల్డ్ 2017 పోటీ విజేత. ఈమె ఫెమినా మిస్ 2017 పోటీలో హర్యానా రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి.. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా అదే సంవత్సరంలో టైటిల్‌ను గెలుచుకుంది. తర్వాత 17 ఏళ్ల తర్వాత మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న ఆరవ భారతీయురాలిగా మానుషి చిల్లర్ నిలిచింది.
మానుషి చిల్లర్ చారిత్రాత్మక నాటకం సామ్రాట్ పృథ్వీరాజ్‌లో సన్యోగిత పాత్రతో తను సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత నుంచి ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీలో చాన్స్ దక్కించుకుంది. ఇందులో ఆమె విక్కీ కౌశల్ సరసన నటించింది. చిల్లర్ నటనను బాగా ఆదరించలేదు. అలాగే హిందీ, తెలుగు ద్విభాషా చిత్రమైన ఆపరేషన్ వాలెంటైన్‌లో వరుణ్ తేజ్ సరసన చిలార్ వింగ్ కమాండర్ పాత్రను పోషించింది.
తర్వాత 2014 చిల్లార్.. అక్షయ్ కుమార్ అండ్ టైగర్ ష్రాప్ నటించిన బడే మియాన్ చోటే మియాన్‌లో నటించింది. బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం చెందింది. ఆమె తదుపరి దినేష్ విజన్ టెహ్రాన్‌లో జాన్ అబ్రహం సరసన నటించింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. మానుషి చిల్లర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆకట్టుకునే ఫొటోలు పంచుకుని.. ‘‘కళ మీతో కూర్చొంటుంది. మీతో మాట్లాడుతుంది.. కొన్నిసార్లు, మీరుగా మారుతుంది. ఈ పోస్ట్‌లోని ప్రతి చిత్రం నాకు ఏదో అర్థం ఇస్తుంది. ఒక కథను చెబుతుంది’’ అంటూ రాసుకొచ్చింది.






