అందమైన చిన్న పాప కండలు పెంచుకోవడానికి ఇష్టపడుతుంది.. నువ్వెంత సేపు ప్లాంక్ చేయగలవంటూ నటి పోస్ట్?

by Kodari Anjali |

హీరోయిన్ మానుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

అందమైన చిన్న పాప కండలు పెంచుకోవడానికి ఇష్టపడుతుంది.. నువ్వెంత సేపు ప్లాంక్ చేయగలవంటూ నటి పోస్ట్?
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ మానుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ పదిహేడేళ్ల తర్వాతనే విశ్వసుందరి కిరీటాన్ని భారత్‌కు అందించింది. మిస్ ఇండియా కిరిటీం గెలుచుకున్నప్పటి నుంచి ‘ప్రాజెక్టు శక్తి’లో భాగంగా మహిళలకు నెలసరి సమస్యలపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అలాగే మిస్ వరల్డ్ కిరీటం గెలవడం మానుషి చిన్ననాటి కోరిక అని చాలా ఇంటర్య్వూల్లో ఆమె ఈ విషయం చెప్పుకొచ్చింది.

స్కూల్, కాలేజీ స్థాయిల్లోనూ అనేక అందాల పోటీల్లో మానుషి విజేతగా నిలిచారని ఓ సందర్భంలో అన్నారు. ఇకపోతే ఈ హీరోయిన్ సామ్రాట్ పృథ్వీరాజ్, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, ఆపరేషన్ వాలెంటైన్, బడే మియాన్ చోటే మియాన్ వంటి సినిమాల్లో మెరిసి తన టాలెంట్‌లో బయటపెట్టింది. అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే మానుషి చిల్లర్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూ.. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోని అభిమానులతో మాత్రం టచ్‌లో ఉంటుంది.

ఇక తాజాగా ఈ హీరోయిన్ సోషల్ మీడియా వేదిక అయిన తన ఇన్‌స్టాగ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తోన్న ఫొటోలు పంచుకుంది. అంతేకాకుండా ఈ పిక్స్‌కు ఓ క్యాప్షన్ కూడా జతచేసింది. ‘‘అందమైన చిన్న పాప కండలు పెంచుకోవడానికి ఇష్టపడుతుంది. నువ్వు ఎంతసేపు ప్లాంక్ చేయగలవు?’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం మానుషి చిల్లర్ ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story