‘మిస్ వరల్డ్ వేదికకు తిరిగి రావడం గౌరవంగా ఉంది’: manushi_chhillar

by Kodari Anjali |   (  Updated:2025-06-01 12:59:42  IST  )

నటి మానుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

‘మిస్ వరల్డ్ వేదికకు తిరిగి రావడం గౌరవంగా ఉంది’: manushi_chhillar
X

దిశ, వెబ్‌డెస్క్: నటి మానుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ మిస్ వరల్డ్ 2017 పోటీ విజేత. ఈమె ఫెమినా మిస్ ఇండియా 2017 పోటీలో హర్యానా రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2017 టైటిల్‌ను గెలుచుకుంది. తర్వాత 17 ఏళ్ల అనంతరం మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న ఆరవ భారతీయురాలుగా మానుషి చిల్లర్ నిలిచింది.

మానుషి చిల్లర్ చారిత్రాత్మక నాటకం సామ్రాట్ పృథ్వీరాజ్‌లో సన్యోగిత పాత్రతో తను సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత నుంచి ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీలో చాన్స్ దక్కించుకుంది. ఇందులో ఆమె విక్కీ కౌశల్ సరసన నటించింది . చిల్లర్ నటనను విమర్శకులు బాగా ఆదరించలేదు. అలాగే హిందీ-తెలుగు ద్విభాషా చిత్రమైన ఆపరేషన్ వాలెంటైన్‌లో వరుణ్ తేజ్ సరసన చిలార్ వింగ్ కమాండర్ పాత్రను పోషించింది.

తర్వాత 2024లో చిలార్ అక్షయ్ కుమార్ అండ్ టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియాన్ చోటే మియాన్‌లో నటించింది. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఆమె తదుపరి దినేష్ విజన్ టెహ్రాన్‌లో జాన్ అబ్రహం సరసన నటించింది. సినిమాల విషయం పక్కన పెడితే.. మానుషి చిల్లర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆకట్టుకునే ఫొటోలు పంచుకుని.. ‘‘ఒకసారి కిరీటం పొందినప్పటి నుంచి ఇప్పుడు పోటీని నిర్ధారించే వరకు మిస్ వరల్డ్ వేదికకు తిరిగి రావడం గౌరవంగా ఉంది. ఇరువైపులా ఉండటం కష్టం కానీ పోటీదారులకు చాలా భయంగా అండ్ ఉత్సాహంగా అనిపించింది. నా రోజులను గుర్తు చేసింది. శక్తితో కూడిన మరపురాని రాత్రి’’. అని రాసుకొచ్చింది.

Next Story