- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
manushi_chhillar: ‘ఆమె ప్రేమ తప్ప మిగతావన్నీ మారిపోయాయి’.. బ్యూటిపుల్ లైన్స్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు
నటి మానుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: నటి మానుషి చిల్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2017 టైటిల్‌ను గెలుచుకుంది. ఈమె యష్ రాజ్ ఫిల్మ్ తో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. సామ్రాట్ పృథ్వీరాజ్‌తో సినీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అనేక ఆడిషన్లు, ట్రయల్స్ అనంతరం అక్షయ్ కుమార్‌కు భార్య పాత్రలో ఓ సినిమాలో అవకాశం కొట్టేసింది. కానీ ఈ మూవీ బాక్సాఫీసు వద్ద పెద్ద విజయం సాధించలేకపోయింది.
అయినప్పటికీ మానుషి చిల్లర్ మరిన్ని అవకాశాలు సంపాదించుకుంది. ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ అనే కామెడీ సినిమాలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. విక్కి కౌశల్ సరసన నటించి జనాల్ని ఆకట్టుకుంది. తెలుగు, హిందీ ద్విభాషా చిత్రమైన ఆపరేషన్ వాలెంటైన్‌లో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన చిలార్ వింగ్ కమాండర్ పాత్ర పోషించింది. వీటితో పాటుగా టైగర్ ష్రాప్ నటించిన బడే మియాన్ చోటే మియాన్‌లో..
టెహ్రాన్‌లో జాన్ అబ్రహంకు జోడిగా నటించింది. ఈ అమ్మడు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా మానుషి నెట్టింట ఓ పోస్ట్ పెట్టింది. పలు ఫొటోలు పంచుకుని ఓ క్యాప్షన్ రాసుకొచ్చింది. ‘‘నా పాత పెయింట్స్, బ్రష్‌ల పెట్టెను చూడటానికి చివరి వరకు స్వైప్ చేయండి, ఇప్పటికీ నా అమ్మమ్మ భద్రపరిచింది. ఆమె ప్రేమ తప్ప మిగతావన్నీ మారిపోయాయి. బాల్యాన్ని ఆమె హృదయానికి దగ్గరగా ఉంచుకుంది’’. అంటూ రాసుకొచ్చింది.






