- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mansa Varanasi: మా అమ్మమ్మ ముందే ఓ అబ్బాయి ప్రపోజ్ చేశాడు.. దాంతో షాక్ అయ్యాను
Mansa Varanasi: మా అమ్మమ్మ ముందే ఒక అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాడు. మా అమ్మమ్మతో 'మీ మనవరాలు అంటే నాకు చాలా ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను. ఆమెని బాగా చూసుకుంటాను' అని చెప్పాడు. దానితో నేను షాక్ అయ్యాను.

దిశ, వెబ్ డెస్క్ : మోడలింగ్ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో మానస వారణాసి ఒకరు. ఈమె మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత దేవకీ నందన వాసుదేవ అనే చిత్రంతో తెలుగుతెరకు పరిచయం అయింది. తాజాగా ఈమె కపుల్ ఫ్రెండ్లీ అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. దానితో ఈమెకు నటిగా గుర్తింపు వచ్చింది. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
అందులో తన చిన్న వయసులో జరిగిన ఒక షాకింగ్ సంఘటన గురించి తెలియజేసింది. తాజాగా మానస మాట్లాడుతూ... "నేను చిన్న వయసులో హాలిడేస్ వస్తే మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళేదాన్ని. అలా ఒక సంవత్సరం నేను మా అమ్మమ్మ ఇంటికి సమ్మర్ హాలిడేస్కి వెళ్ళాను. అలా హాలిడేస్ సమయంలో నేను మా అమ్మమ్మతో కలిసి ఇంట్లో ఉన్న సమయంలో ఎవరో వచ్చి డోర్ కొట్టారు. దానితో మా అమ్మమ్మ వెళ్లి డోర్ తీసింది. డోర్ తీశాక ఒక అబ్బాయి అక్కడ నిల్చొని ఉన్నాడు.
అతని చేతిలో ఒక బొకే ఉంది. ఇక అతను నేరుగా మా అమ్మమ్మతో 'మీ మనవరాలు అంటే నాకు చాలా ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను. ఆమెని బాగా చూసుకుంటాను' అని చెప్పాడు. దానితో నేను షాక్ అయ్యాను. తర్వాత సరదాగా నవ్వుకొని వదిలేసాను. ఇలా నా లైఫ్లో కొన్ని విచిత్రమైన ప్రపోజల్స్ కూడా వచ్చాయి" అని ఈ బ్యూటీ తాజాగా చెప్పుకొచ్చింది.






