- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నమ్మిన వాళ్లనే మోసం చేసే క్యారెక్టర్‌లో మనోజ్.. సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్న టీజర్
రా కింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘డేవిడ్ రెడ్డి’ ఒకటి.

దిశ, సినిమా: రా కింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘డేవిడ్ రెడ్డి’ ఒకటి. ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్‌పై నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమా రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్‌తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ దసరా పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈరోజు హీరో మనోజ్ పుట్టిన రోజు కావడంతో.. ఆ సందర్భంగా ‘డేవిడ్ రెడ్డి’ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
ఈ టీజర్ గమనిస్తే.. 1897 నుంచి 1920 మధ్య బ్రిటీష్ పాలనా కాలం నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ప్రతి విజువల్, ప్రతి షాట్, నటీనటుల ఎంపిక.. ఇలా అన్ని విషయాల్లో హై క్వాలిటీ మేకింగ్ వ్యాల్యూస్ కనిపిస్తున్నాయి. మహాత్ముడి అహింసా మార్గానికి భిన్నంగా హింసా మార్గాన్ని ఎంచుకుంటాడు డేవిడ్ రెడ్డి. అమాయక భారతీయుల్ని హింసిస్తున్న ఆంగ్లేయులపై ప్రతి దాడులు చేస్తూ వారికి దడ పుట్టిస్తాడు. దేశంలో నెహ్రూ, బోస్ వంటి అగ్ర నాయకులు డేవిడ్ రెడ్డి గురించి తెలుసుకుంటూ ఉంటారు. మరోవైపు డేవిడ్ రెడ్డి రూపంలో తమ సామ్రాజ్యానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి లండన్‌లోని బ్రిటీష్ ఇంటెలిజెన్స్ వార్ రూమ్‌లో చర్చలు జరుగుతుంటాయి.
50 బెటాలియన్లలోని 2 వేల మందిని ఒంటరిగా ఎదుర్కొన్న డేవిడ్ రెడ్డి సాహసం, దేశాన్ని మోసం చేసేందుకు సిద్ధంగా ఉన్న అతని వ్యక్తిత్వం బ్రిటీషర్స్‌ను ఆకర్షిస్తుంది. డేవిడ్ రెడ్డిని తమ కోసం పనిచేసేలా ఒప్పించాలని బ్రిటీషర్స్ ప్లాన్ చేస్తారు. అమాయకుల్ని కాపాడే డేవిడ్ రెడ్డి దేశాన్ని ఎందుకు మోసం చేయాలనుకున్నాడు?, భారతీయులే అతన్ని అరెస్ట్ చేయాలని ఎందుకు కోరుకున్నారు?, డేవిడ్ రెడ్డి అంతిమ లక్ష్యం ఏంటి, బ్రిటీష్ యువతితో అతని ప్రేమ కథ ఎలా సాగింది...? ఇలాంటి అంశాలతో టీజర్ ఆద్యంతం ఆసక్తి కలిగించింది. డేవిడ్ రెడ్డి కాదు రాక్షస రెడ్డి అని బ్రిటీషర్స్ భయంతో చెప్పడం అతని క్యారెక్టర్‌లోని వైల్డ్ నెస్‌ను చూపిస్తోంది. మొత్తంగా ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై క్యూరియాసిటీ పెరిగేలా చేసింది.






