- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వడ్డీ కాసుల వాడ అంటున్న మనోజ్.. వింటేజ్ హీరోను చూసి ఫ్యాన్స్ ఫిదా
నేడు (బుధవారం) మంచు మనోజ్ బర్త్‌డే కావడంతో.. ఆయన నటిస్తున్న సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్.

దిశ, సినిమా: నేడు (బుధవారం) మంచు మనోజ్ బర్త్‌డే కావడంతో.. ఆయన నటిస్తున్న సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే మ్యాన్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించబోతున్న ‘NBK-111’ లో మనోజ్ భాగం అయినట్లు తెలిపారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో మనోజ్ పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు విడుదల చేసిన పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది. ఇక దీంతో పాటు మనోజ్ నటిస్తున్న మరో చిత్రం నుంచి అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం అందరి జీవితాల్లో ఈఎంఐలు ప్రధాన భాగంగా మారిపోయాయి. అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘వడ్డీ కాసుల వాడ’ అనే డిఫరెంట్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కబోతున్న ఈ మూవీ నుంచి మనోజ్ బర్త్‌డే స్పెషల్‌గా రివీల్ చేసిన వీడియో అందరిని ఆకట్టుకుంటుంది. టైటిల్ క్యాచీగా ఉండటం, మనోజ్ మ్యానరిజం, కామెడీ టైమింగ్ ఇవన్నీ చూస్తుంటే ఈ చిత్రంతో వింటేజ్ మనోజ్ మరోసారి బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనున్నట్లు అర్థం అవుతుంది. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట విశేషంగా వైరల్ అవుతున్నది.






