- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామాయణ, వారణాసి సినిమాల బడ్జెట్‌పై మనోజ్ భాజ్‌పేయి సంచలన వ్యాఖ్యలు
సాధారణ ప్రేక్షకులకు ఈ బడ్జెట్ లెక్కలతో ఎలాంటి సంబంధం లేదని, ఒక సినిమా చూశాక అది నచ్చిందా లేదా అనేదే ప్రేక్షకుడికి ముఖ్యం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫైనాన్షియల్ థ్రిల్లర్ ‘గవర్నర్’ జూన్ 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన భారీ ప్రాజెక్ట్స్ రామాయణ, వారణాసిలపై వివాదాస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఎస్.ఎస్. రాజమౌళి-మహేష్ బాబుల ‘వారణాసి’ (రూ. 1400 కోట్లు), రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ (రూ. 4000 కోట్లు) వంటి అత్యంత భారీ బడ్జెట్‌పై మనోజ్ బాజ్‌పేయి స్పందిస్తూ.. ఇదంతా కేవలం ఒక పీఆర్ఎత్తుగడ మాత్రమేనని కొట్టిపారేశారు. గత 15 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఇలాంటి నెంబర్ల హడావుడిని తాను చూస్తున్నానని చెప్పారు. సినిమా అనేది పూర్తిగా నిర్మాతకు సంబంధించిన వ్యాపారమని, ఎంత ఖర్చు పెట్టాలి.. ఎంత వెనక్కి రాబట్టాలి అనేది కేవలం మేకర్స్ వ్యక్తిగత విషయమని అన్నారు. సాధారణ ప్రేక్షకులకు ఈ బడ్జెట్ లెక్కలతో ఎలాంటి సంబంధం లేదని, ఒక సినిమా చూశాక అది నచ్చిందా లేదా అనేదే ప్రేక్షకుడికి ముఖ్యం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ మధ్య కాలంలో సినిమా బిజినెస్ ట్రెండ్ ఎంతగా మారిపోయిందంటే.. చివరికి ఎయిర్‌పోర్టులో తనను కలిసే సామాన్య జనం కూడా మూవీ కథ గురించి కాకుండా, ఎన్ని కోట్లు వసూలు చేసింది… బాక్సాఫీసు కలెక్షన్స్ ఎంతొచ్చాయి అనే విషయాల గురించే మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 500 కోట్లు లేదా రూ. 600 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే అందులోంచి ఒక్క రూపాయి కూడా ప్రేక్షకుల జేబుల్లోకి లేదా వారి బ్యాంక్ ఖాతాల్లోకి వెళ్లదని, ఆ డబ్బు అంతా నిర్మాత ఖాతాకే చెందుతుందని స్పష్టం చేశారు. కాబట్టి కలెక్షన్ల లెక్కలు పక్కనపెట్టి, కేవలం కంటెంట్ బాగుందా లేదా అనే కోణంలోనే సినిమాను చూడాలని అన్నారు. ప్రస్తుతం మనోజ్ బాజ్‌పేయి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మనోజ్ బాజ్‌పేయి నటించిన ‘గవర్నర్’ సినిమాకు మార్కెట్లో ఆశించినంత స్థాయిలో బజ్ ఏర్పడలేదని, అందుకే నెటిజన్ల దృష్టిని ఆకర్షించడానికి, తన సినిమా ప్రమోషన్ కోసం రాజమౌళి, రణ్‌బీర్ కపూర్ వంటి టాప్ సెలబ్రిటీల పెద్ద ప్రాజెక్టులను టార్గెట్ చేస్తూ ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారంటూ కొందరు విమర్శిస్తున్నారు.






