ఆ తేదీన 'మన్మధ' రీ-రిలీజ్

by Pulgam srinivas |

'మన్మధ' చిత్రాన్ని జూలై 18న ఆంధ్రప్రదేశ్, నైజాం ప్రాంతాల్లో రీ-రిలీజ్ చేయనున్నారు.

ఆ తేదీన మన్మధ రీ-రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: శింబు హీరోగా, జ్యోతిక హీరోయిన్‌గా నటించిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ 'మన్మధ'. 2004లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయాన్ని అందుకుంది. తమిళంలో 'మన్మధన్' పేరుతో రూపొందిన ఈ సినిమాను తెలుగులో 'మన్మధ' పేరుతో విడుదల చేయగా, కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను జూలై 18న ఆంధ్రప్రదేశ్, నైజాం ప్రాంతాల్లో రీ-రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పలు డబ్బింగ్ చిత్రాలు రీ-రిలీజ్‌లో తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. మరి 'మన్మధ' కూడా అదే జాబితాలో చేరుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఏ.జె. మురుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శింబు స్వయంగా స్క్రీన్‌ప్లే అందించగా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చారు.




Next Story