- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహేష్ కోసం ప్రత్యేక ప్లాన్‌తో ముందుకొచ్చిన మణిశర్మ
అతిథి చిత్రానికి సంగీతం అందించిన మణిశర్మ, ఈ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా దానిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా మ్యూజిక్ పనులు ప్రారంభించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అమృతా రావు హీరోయిన్‌గా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన అతిథి చిత్రం 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మురళీ శర్మ, ఆశిష్ విద్యార్థి, కోట శ్రీనివాసరావు, నాజర్, రాజీవ్ కనకాల, వేణు మాధవ్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. అయితే ఈ చిత్రాన్ని మే 29వ తేదీన 4కే వెర్షన్లో భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడింది. సాధారణంగా రీ-రిలీజ్ అనగానే సినిమాలను 4kలో విడుదల చేయడం సాధారణమే.
కానీ అతిథి సినిమా విషయంలో మేకర్స్ ఓ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంగీత దర్శకుడు మణిశర్మ కూడా పూర్తి సహకారం అందిస్తున్నట్లు సమాచారం. అతిథి చిత్రానికి సంగీతం అందించిన మణిశర్మ, ఈ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా దానిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా మ్యూజిక్ పనులు ప్రారంభించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రీ-రిలీజ్ కోసం కూడా ప్రత్యేకంగా సంగీత పనులు జరుగుతున్నాయనే వార్త బయటకు రావడంతో, ఈ చిత్రాన్ని తప్పక థియేటర్లలో చూడాలనే ఆసక్తి మహేష్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






