- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అది రేవ్ పార్టీ కాదు బర్త్ డే పార్టీ.. వీడియో రిలీజ్ చేసిన మంగ్లీ
తమ పేరెంట్స్ కోరిక మేరకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించామని సింగర్ మంగ్లీ అన్నారు. చేవెళ్ల ఫార్మ్‌హౌస్ ఘటనపై ఆమె స్పందిస్తూ వీడియోను విడుదల చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తమ పేరెంట్స్ కోరిక మేరకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించామని సింగర్ మంగ్లీ అన్నారు. చేవెళ్ల ఫార్మ్‌హౌస్ ఘటనపై ఆమె స్పందిస్తూ వీడియోను విడుదల చేశారు. అసలు పార్టీలో మాదక ద్రవ్యాలు వాడలేదని చెప్పారు. అందరికీ టెస్టులు చేస్తే ఒక్కరికి పాజిటివ్ వచ్చింది. అతను కూడా గతంలో తీసుకున్నాడని పోలీసులు చెప్పారన్నారు. మద్యం, డీజేకు పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని తమకు తెలియదన్నారు.
తెలిస్తే ఇలా జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీలో కేవలం తమ తల్లి దండ్రులు వారి మిత్రులు, తన మిత్రులు ఉన్నారని తెలిపారు. విదేశీ మద్యం కూడా పార్టీలో లేదని స్పష్టం చేశారు. తాను రోల్ మోడల్ గా ఉండాలని అనుకుంటానని కానీ ఎలాంటి తప్పుడు పనులు చేయనని చెప్పారు. తల్లి దండ్రుల కోరిక మేరకు సడెన్ గా ఆ పార్టీని అనుకోవడం వల్ల సరిగ్గా ప్లాన్ చేసుకోలేదని అన్నారు. దయచేసి తనపై ఎలాంటి అభియోగాలు మోపవద్దని రిక్వెస్ట్ చేశారు.






