- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే, అంత మంచిది.. పూరి జగన్నాథ్‌పై మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ(Kannappa Movie) జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ(Kannappa Movie) జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా.ఎం.మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇప్పటికే ప్రీరిలీజ్ ఫంక్షన్ పూర్తికాగా, తాజాగా మంచు విష్ణు(Manchu Vishnu) ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డెరైక్టర్ పూరి జగన్నాథ్(Director Puri Jagannath) మీద మీ ఓపీనియన్ ఏంటని యాంకర్ అడగ్గా.. ‘ఆయన ఒకప్పుడు గొప్ప దర్శకుడు, క్యారెక్టరైజేషన్‌లో ఆయన్ను మించినోళ్లు లేరు.. కానీ ఇప్పుడు ఆయన వేరు. ఇప్పుడు ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే, అంత మంచిది’ అని మంచు విష్ణు చెప్పినట్లు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. దీంతో ఆ పోస్టుల కింద అభిమానులు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. పూరి ఎవర్‌గ్రీన్.. ఆయన గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త అని కామెంట్లు పెడుతున్నారు.
కాగా, పరమ శివుని భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషించగా, మోహన్ బాబు, ప్రభాస్, శరత్‌కుమార్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ వంటి అగ్రతారలు కీలక పాత్రల్లో నటించారు. ట్వీట్






