- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Manchu Vishnu: అక్షయ్ కుమార్ రెమ్యునరేషన్ గట్టిగానే తీసుకున్నాడు.. షాకింగ్‌గా మారిన మంచు విష్ణు కామెంట్స్
మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa).

దిశ, సినిమా: మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వంలో రాబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు (Mohan Babu) హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం జూన్ 27న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం కాబోతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. వరుసగా అప్‌డేట్స్ ఇవ్వడంతో పాటు ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు మరోసారి రెమ్మునరేషన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఈ సినిమాలో నటిస్తున్న ప్రముఖ స్టార్స్ లైక్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) కూడా ఒక్క రూపాయి రెమ్యునరేషన్ ఆశించకుండా ఇందులో యాక్ట్ చేస్తున్నారని తెలిసింది అని యాంకర్ ప్రశ్నించగా.. దీనిపై మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘అక్షయ్ కుమార్ తీసుకున్నారు. ఆయన గట్టిగానే రెమ్యునరేషన్ తీసుకున్నారు. కానీ ఆయన తీసుకునే దాని కంటే తక్కువ తీసుకున్నారు’ అని తెలిపాడు. ఇక మోహన్ లాల్ (Mohan Lal), ప్రభాస్ (Prabhas) గురించి మాట్లాడుతూ.. వీళ్లు రెమ్యునరేషన్ పేరు ఎత్తితేనే నన్ను తిట్టేవారు. ప్రభాస్ అయితే ఏకంగా విష్ణుని చంపేస్తా అని చెప్పండి ఇంకోసారి రెమ్యునరేషన్ గురించి నాతో మాట్లాడితే అని నాన్నతో అన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. ఈసినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్‌తో పాటు ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తు్న్న విషయం తెలిసిందే.
#Prabhas remuneration గురించి మాట్లాడిస్తే, "విష్ణుని చంపేస్తా అని చెప్పండి" అన్నాడు.#Mohanlal గారు డబ్బుల సంగతి మాట్లాడితే తిట్టాడు..#AkshayKumar గారు గట్టిగానే తీసుకున్నారు.
— Whynot Cinemas (@whynotcinemass_) May 27, 2025
- #ManchuVishnu | #Kannappa pic.twitter.com/CpiAW6QQtu






