మంచు విష్ణు సంచలన నిర్ణయం

by Muthe.Rajitha |   (  Updated:2025-08-06 15:37:38  IST  )

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA) అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మంచు విష్ణు సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(MAA) అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినీ కళాకారుల ప్రదర్శనలకు సంబంధించి ఈ ముఖ్య నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని విష్ణు అన్నారు. ఇకపై అవార్డు ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలలో నటీనటులు డ్యాన్స్, స్కిట్స్, మిమిక్రీ వంటి ప్రదర్శనలు ఇవ్వాలంటే ఈవెంట్ మేనేజర్లు తప్పనిసరిగా ‘మా’ అసోసియేషన్ నుండి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసారు. ఈ నియమం తెలుగు సినీ కళాకారులకు వర్తిస్తుందని, అలాగే ఇది తక్షణమే అమలులోకి వస్తుందని బుధవారం ప్రకటించారు. అనుమతి లేకుండా ప్రదర్శనలు ఇచ్చి, పారితోషికం చెల్లించకపోతే ‘మా’ బాధ్యత వహించదని తేల్చి చెప్పారు.

కాగా, గతేడాది జరిగిన ప్రముఖ అవార్డు సంస్థ సైమా స్కాంపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘మా’లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గతేడాది జరిగిన అవార్డు ఫంక్షన్ లో తన పర్ఫార్మెన్స్ కు పారితోషికం ఇవ్వకుండా ఎగ్గొట్టారని, తనకు న్యాయం జరిపించాలని ‘మా’ను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన మంచు విష్ణు, క్యాస్టింగ్ మేనేజర్స్‌తో సమావేశమై, కళాకారుల హక్కుల రక్షణ కోసం ఈ కొత్త నిబంధనలను విధించారు.

Next Story