Kannappa: భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ‘కన్నప్ప’.. బుకింగ్స్ ఎప్పటినుంచి స్టార్ట్ అంటే?

by Chukka Sudharani |

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27న గ్రాండ్ లెవల్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది.

Kannappa: భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ‘కన్నప్ప’.. బుకింగ్స్ ఎప్పటినుంచి స్టార్ట్ అంటే?
X

దిశ, సినిమా: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27న గ్రాండ్ లెవల్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా చోట్ల బుకింగ్స్‌ను ఓపెన్ కాగా.. ఈ సోమవారం నుంచి ఉత్తర అమెరికాలో, జూన్ 25 నుంచి భారతదేశం అంతటా టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ హై బడ్జెట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 5,400 స్క్రీన్లలో భారీ ఎత్తున విడుదల కానుంది. అందరూ ఎదురుచూస్తున్న అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో.. సినీ విశ్లేషకుల్లో ఈ చిత్రం ఓపెనింగ్ డే రికార్డుల మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇండియాలో ఈ మూవీని 4,300కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేయబోతోన్నారు. ప్రతి ప్రీమియం-ఫార్మాట్ ఆడిటోరియం (IMAX, స్క్రీన్ X మరియు 4DXతో సహా)లో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఇక ఓవర్సీస్‌లో 1,100పైగా స్క్రీన్లు, 200లకు పైగా యూస్ ప్రీమియర్లను ప్లాన్ చేశారు. కాగా.. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, ఆర్. శరత్‌కుమార్, బ్రహ్మానందం వంటి మహామహులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story