- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నీకోసం తపస్సు చేసే నన్నే పరీక్షిస్తున్నావా స్వామీ’.. మంచు విష్ణు ట్వీట్
కన్నప్పు మూవీ(Kannappa Movie) హార్డ్ డిస్క్ మిస్సవ్వడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: కన్నప్పు మూవీ(Kannappa Movie) హార్డ్ డిస్క్ మిస్సవ్వడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మంచు విష్ణు(Manchu Vishnu) సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టారు. కన్నప్ప మూవీ టీమ్ నుంచి మరో ట్వీట్ పెట్టారు. ఇందులో ‘‘జటాజూఠదారీ, నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ’’ అని పేర్కొన్నారు. అయితే. హార్డ్ డిస్క్ మిస్ అయిన వేళ ఈ ట్వీట్ పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. శివుడే తనను పరీక్షిస్తున్నాడనే ఉద్దేశంతో విష్ణు ఈ ట్వీట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
కాగా, ఇప్పటికే హార్డ్ డిస్క్ మాయంపై సినిమా ఎగ్జిక్యూటివ్ నిర్మాత రెడ్డి విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు ఫిల్మ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హార్డ్ డిస్క్‌లో ప్రభాస్ యాక్షన్ సీన్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. దీనిపై చిత్రబృందం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కన్నప్ప సినిమాలో ప్రభాస్ దాదాపు 30 నిమిషాల పాటు కనిపించనున్నారని మంచు విష్ణు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఏకంగా ప్రభాస్ ఉన్న సీన్లకు సంబంధించిన డ్రైవ్ మాయం కావడం పెద్ద దెబ్బే అని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
#HarHarMahadevॐ #kannappa pic.twitter.com/jKNfIOTrQH
— Vishnu Manchu (@iVishnuManchu) May 27, 2025






