- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"కన్నప్ప"పై మనోజ్ రివ్యూ.. షాకింగ్ రియాక్షన్ ఇచ్చిన విష్ణు
మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. చిత్రంలో విష్ణుతో పాటు ప్రభాస్, ఇతర ఇండస్ట్రీలకు

దిశ, వెబ్ డెస్క్: మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. చిత్రంలో విష్ణుతో పాటు ప్రభాస్, ఇతర ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు ఉండటంతో కన్నప్ప క్రేజ్ మరింత పెరిగింది. ఇక చాలా కాలం తరవాత హిట్ పడటంతో ఆయన ఫుల్ కుషీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా గురించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయనకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. కన్నప్ప సినిమా చూసిన తరవాత మంచు మనోజ్ రివ్యూ ఇచ్చారు.
సినిమా చాలా బాగుందని అన్నారు. క్లైమాక్స్ ఊహించిన దానికంటే వెయ్యి రెట్లు బాగుందని చెప్పారు. క్లైమాక్స్ లో అద్భుతంగా నటించారని అన్నారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఇక సినిమా విడుదలకు ముందు కన్నప్పలో నటించిన మోహన్ బాబు, విష్ణు పిల్లల ఫోటోలు షేర్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కానీ హీరోగా నటించిన విష్ణు పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. గత కొద్ది రోజులుగా విష్ణు, మనోజ్ మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మనోజ్ రివ్యూపై ఇంటర్వ్యూలో విష్ణును ప్రశ్నించారు. దీంతో విష్ణు సినిమా బాగుందని చెప్పిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నా అన్నారు. అతను కూడా మనోజ్ పేరు ఎత్తకుండా ప్రతిఒక్కరికీ థాంక్స్ అంటూ ఆ సంభాషణకు పులిస్టాప్ పెట్టారు.






